జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్రంగా వేధిస్తున్న విద్యుత్ సిబ్బంది కొరత
రిపోర్టర్: రాము
స్థలం: జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం విద్యత్ ఉపవిభాగం పరిధిలో తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఐదు మండలాలకు సుమారు 150 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 30 నుంచి 35 మందే పనిచేస్తుండటంతో ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోంది. సరైన వాహన సౌకర్యం, భద్రతా పరికరాలు లేకపోయినా రాత్రివేళల్లో, అటవీ ప్రాంతాల్లో సైతం సిబ్బంది ప్రాణాలకు తెగించి మరమ్మతులు చేస్తున్నారని, దీనివల్ల ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.