నగల మెరుగు పేరుతో బాజీతండాలో వృద్ధురాలిని నమ్మించి బంగారు గొలుసు దోచేసిన కేటుగాడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పర్వతగిరి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్ శివారు బాజీ తండాలో మాలోతు శాంతి అనే వృద్ధురాలిని నగల మెరుగు పేరుతో నమ్మించి ఓ దుండగుడు బంగారు గొలుసు అపహరించుకుపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీస్ అధికారులు ప్రత్యేక ఫోన్ నంబర్లను వెల్లడించారు.