ఉట్నూర్లో నూతన సోలార్ ఎనర్జీ ఈవీ ఛార్జింగ్ ప్లాంట్ ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఉట్నూర్

ఉట్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ సోలార్ ఎనర్జీ ఈవీ ఛార్జింగ్ ప్లాంట్ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోలార్ ఎనర్జీ ఆధారిత ఈవీ ఛార్జింగ్ ప్లాంట్లు అందుబాటులోకి రావడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.