అమనగల్లు మార్కెట్ యార్డులో పందుల దాడితో అన్నదాతల తీవ్ర ఆవేదన
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
అమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు ఆరబెట్టిన ధాన్యంపై దాడి చేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఎంతో కష్టపడి పంటను తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్న రైతులు పందుల బెడదతో నిత్యం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యపై మార్కెట్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పందుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.