జైపూర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం: నిందితుడి అరెస్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: Jaipur
జైపూర్‌లో ఐదేళ్ల చిన్నారిపై పరిచయస్తుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు బెదిరించడంతో చిన్నారి మౌనంగా ఉంది. ఇటీవల నిందితుడు ఇంటికి వచ్చినప్పుడు 'అంకుల్ బ్యాడ్' అని చిన్నారి అనడంతో అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడిని జైసల్మేర్‌లోని రామ్‌దేవరాలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.