దేశ రాజధానిలో కలకలం: ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా అరెస్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా పోలీసులచే అదుపులోకి తీసుకోబడ్డారని జర్నలిస్టు వర్గాలు వెల్లడించాయి. జేఎన్యు పరిశోధక విద్యార్థి అయిన ఆమె, దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో పోరాటం సాగిస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు.