కబడ్డీ విజేతలకు బహుమతులు అందజేసిన జనసేన నేతలు

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా బోనంగి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నిర్వాహకులు షీల్డ్స్ మరియు క్యాష్ ప్రైజెస్ను ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి బుగిడి రామ గోవిందరావు, మాజీ సర్పంచ్ బొద్ధపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.