రావుట్ల అడవుల్లో అక్రమంగా నరికిన టేకు దుంగల స్వాధీనం

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల సెక్షన్లోని బీట్ కంపార్టుమెంట్లో గస్తీ నిర్వహిస్తున్న అటవీ సిబ్బందికి వాగులో కుప్పగా వేసిన సుమారు ముప్పై ఏడు టేకు దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సిరికొండ రేంజ్ కార్యాలయానికి తరలించి విలువ లెక్కించగా సుమారు అరవై ఎనిమిది వేల రూపాయలుగా తేలిందని, దుంగలు నరికిన వ్యక్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.