ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయి హెచ్చరికలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: వాషింగ్టన్

ఇరాన్ తో చర్చలు విఫలమైతే సైనిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తమ సైన్యం గంటలో ఆపరేషన్ పూర్తి చేయగలదని స్పష్టం చేశారు. పికాక్స్ పర్వతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని తెలిపారు. అదే సమయంలో ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.