30 ఏళ్ల తర్వాత.. స్నేహితుల కలయిక

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

కొండకర్లలో 10వ తరగతి నాటి స్నేహితులు 30 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. సుమారు 70 మంది పూర్వ విద్యార్థులు హాజరై చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి పాఠశాల రోజులు, స్నేహాలను గుర్తుచేసుకుంటూ ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు.చదువుకునే రోజుల్లో కలిసి తిరిగిన స్నేహితులు కాలక్రమంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నా తమ మధ్య స్నేహబంధం ఏమాత్రం తగ్గలేదని పలువురు పేర్కొన్నారు