ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని అధికారుల పిలుపు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక చవితి ఉత్సవాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పి శ్రీనివాస్ నాయుడు, సిఐ శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.