గణనాథుని లడ్డు వేలంలో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకున్న జనం

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం కస్పా ఆర్యవైశ్య సంఘ భవనంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వినాయకునికి సమర్పించే లడ్డూ వేలం పాట ఉత్కంఠ భరితంగా సాగింది. సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగిన ఈ వేలం పాటలో ఇమ్మిడిశెట్టి నరసింగరావు, కాపుగంటి రామకృష్ణ దంపతులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆనందాన్ని వ్యక్తం చేసి స్వామి ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టారు.