ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని MRI సేవలతో పేదల పాట్లు:డా. శివప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాంపల్లి
తెలంగాణలో మూడు కోట్ల ఎనభై లక్షల జనాభాకు కేవలం తొమ్మిది ప్రభుత్వ ఎంఆర్ఐ యంత్రాలు మాత్రమే ఉండటం పట్ల సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఈ సౌకర్యం లేకపోవడంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అత్యవసర వైద్య సేవలందిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రభుత్వ ఎంఆర్ఐ యంత్రాలను తక్షణమే ఏర్పాటు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.