టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్: ఫిట్‌నెస్‌పై కీలక ఆదేశాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
టీమిండియా వరుస ఓటములు, ఆటగాళ్ల గాయాల సమస్యలపై బీసీసీఐ ముంబైలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కోచ్ గంభీర్ హాజరైన ఈ భేటీలో భవిష్యత్ సిరీస్‌ల రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. ముఖ్యంగా ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌పై కఠినంగా వ్యవహరించాలని, రికవరీ విషయంలో పొరపాట్లు జరగకూడదని వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ఆదేశించింది. ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఉంటేనే ప్లేయర్లకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది.