ఢిల్లీలో సీఈసీ రాజీనామా కోరుతూ నిరసన: జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత
రిపోర్టర్: సునీల్
స్థలం: ఢిల్లీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ఈ నిరసనకు రూపకల్పన చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.