భారీ వరద ఉధృతికి కూలిన బ్రిడ్జి స్తంభించిన రాకపోకలు

రిపోర్టర్: నరేష్ స్థలం: ములకలపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట వద్ద భారీ వరద తాకిడికి కీలకమైన బ్రిడ్జి కూలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేసి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.