అరకు కాఫీకి గ్లోబల్ గుర్తింపు: ప్రీమియర్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయను గ్లోబల్ స్థాయిలో ప్రీమియర్ కాఫీ డెస్టినేషన్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా గిరిజన రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ప్రపంచ మప్లో ఏపీకి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మొదలైన అరకు కాఫీ ప్రయాణం నేడు ప్రపంచ దేశాలలోని కాఫీ కప్పుల వరకు చేరిందని సీఎం చంద్రబాబు కొనియాడారు.