క్రీడా ఉపాధ్యాయులపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటంటూ గోండు శంకర్ ధ్వజమెత్తారు
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళంలో అర్హత కలిగిన క్రీడా ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ నేత గోండు శంకర్ తీవ్రంగా ఖండించారు. మూడుసార్లు నేషనల్స్ గెలిచిన తనను ఫేక్ అనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఉపాధ్యాయులను, మహిళా క్రీడాకారులను అవమానిస్తే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని శివనాగిరెడ్డి, షేక్ యాసిన్ తదితరులు హెచ్చరించారు.