పెదబయలులో కోట్ల విలువైన హాసిస్ ఆయిల్ పట్టివేత
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
అల్లూరి జిల్లా పెదబయలు మండలం సీతగుంట బ్రిడ్జి వద్ద ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పది కిలోలకు పైగా హాసిస్ ఆయిల్ పట్టుబడింది. దీని విలువ సుమారుగా కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు ఉండగా ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.