కొత్తూరులో వరద ముప్పునకు శాశ్వత పరిష్కారంగా ఏడు మూరల గట్టు పునర్నిర్మాణం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రాంబిల్లి
కొత్తూరు, పరిసర గ్రామాలను ఏళ్లుగా వేధిస్తున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏడు మూరల గట్టు పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం నాయకులు, గ్రామస్థులతో కలిసి గట్టు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. గట్టు బలహీనంగా ఉండటంతో భారీ వర్షాల సమయంలో పంటలు దెబ్బతింటున్నాయని, నిధులు మంజూరు చేయించి త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.