తిరుపతిలో భక్తుల దోపిడీపై అధికారుల ఉక్కుపాదం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుపతి

తిరుపతి బ్రహ్మోత్సవాల వేళ భక్తులను దోచుకుంటున్న దుకాణాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వసూలు చేస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించారు. అపరిశుభ్రంగా ఉన్న రెండు హోటళ్లను సీజ్ చేసి, 500 కిలోల ఆహార వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. భక్తులను దోచుకుంటే సహించేది లేదంటూ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.