పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సందర్శన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
దక్షిణాఫ్రికాలోని చారిత్రక పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సందర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. గాంధీజీని రైలు నుంచి గెంటివేసిన ప్లాట్‌ఫాం, స్మారక కేంద్రాన్ని పరిశీలించారు. జాతి వివక్ష, వలసవాద অణచివేతపై ప్రపంచవ్యాప్త ఉద్యమానికి దారితీసిన ప్రదేశం ఇదని ఆయన కొనియాడారు. ఆయన వెంట అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఉన్నారు.