హిందూపురంలో గరిడి వినాయకుడి విగ్రహంపై హెలికాప్టర్‌తో పూలవర్షం

రిపోర్టర్: రాము స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఆదివారం గరిడి వినాయకుడి విగ్రహంపై హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించారు. రైల్వేరోడ్డులో 50 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న ఈ వినాయకుడి కోసం ఉత్సవ కమిటీ బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ తెప్పించి పూలు చల్లించారు. ఈ వేడుకను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా, అనంతరం పట్టణంలో వందల గణపతి ప్రతిమల నిమజ్జన శోభాయాత్ర కనులపండువగా సాగింది.