ఆమనగల్లులో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, వెంకటయ్య, ఆంజనేయులు, రాము, రజక సంఘం నాయకులు బుచ్చయ్య, రమేష్, తిరుపతయ్య, సురేష్, శివ పాల్గొన్నారు.