జీకే వీధిలో రేపు వైసీపీ నాయకుల ముఖ్య సమావేశం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జీకే వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం : స్థానిక ఎన్నికల దిశానిర్దేశం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 9 గంటలకు జీకే వీధి మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు హాజరుకానున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.