పెద్దపల్లి ఎంపీ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Telangana
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నాల్గు వేల రెండు వందల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టుల పనులు పెండింగ్లో ఉన్నాయని, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిందేమిటని బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు సాగునీరు, కరెంట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆయన హెచ్చరించారు.