తెలంగాణ బీజేపీ ఐటీ విభాగం కో కన్వీనర్గా నియమితులైన బెల్లంపల్లి కేశవ్ సోనీ

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బిజెపి తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగానికి కో కన్వీనర్ గా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కేశవ్ సోనీ సోమవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.