దిశ కథన ప్రభావం: పైనంపల్లి విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాల పంపిణీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమలాయపాలెం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పైనంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎట్టకేలకు యూనిఫాం మరియు పాఠ్యపుస్తకాలు అందాయని అడిషనల్ కలెక్టర్ శ్రీజ తెలిపారు. ఐదు నెలలుగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం నోచుకోని విద్యార్థుల దుస్థితిపై ఇటీవల ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే పుస్తకాలు అందించాలని ఆదేశించడంతో, హెడ్మాస్టర్ పార్థసారథి విద్యార్థులకు వాటిని అందజేసి వారిలో ఆనందం నింపారు.