నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆర్పీఎస్సీ సెకండ్ గ్రేడ్ టీచర్ ఫలితాలు విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: జైపూర్

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైన్స్ విభాగం సీనియర్ ఉపాధ్యాయ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జూలై 14వ తేదీన నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన అర్హత జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 24 నుండి 30వ తేదీ లోపు ఆన్లైన్లో వివరాల దరఖాస్తును సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.