నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఇండియన్ కోస్ట్ గార్డ్ దరఖాస్తులకు గడువు పెంపు

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ దరఖాస్తుల గడువు అక్టోబర్ 21వ తేదీ వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 365 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. నావిక్, యాంత్రిక్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నవంబర్లో నిర్వహించనున్నట్లు సమాచారం అందించారు.