కుక్కునూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.