షాద్‌నగర్‌లో పాఠశాల మెట్లపై నుంచి పడి నాలుగో తరగతి విద్యార్థి మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పాఠశాల సమయం ముగిసిన తర్వాత కిందకు వస్తున్న క్రమంలో ఈ ఘటన జరుగగా, సీసీటీవీలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.