తెనాలి వేదికగా వచ్చే ఏడాది జనవరిలో నంది నాటకోత్సవాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, నాటక రంగానికి పూర్వవైభవం తెచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు జిల్లా తెనాలి వేదికగా వచ్చే ఏడాది జనవరి నెలలో నంది నాటకోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. రాబోయే రెండు రోజుల్లోనే ఈ నాటకోత్సవాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా, 28 జిల్లాల పరిధిలోని కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాల తెలుగు నాటక సమాజాలకు కూడా ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.