'కాల్లర్ పట్టుకుని అడుగుతాం': కేసీఆర్ సంచలన సవాల్
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR ఘాటు వ్యాఖ్యలు చేశారు. కళ్లల్లో కళ్లుపెట్టి కాకుండా నేరుగా కాలర్ పట్టుకుని నిలదీస్తామని కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. దమ్ముంటే అసెంబ్లీ సస్పెన్షన్ ఎత్తేసి, నెల రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.