అలియా భట్ సెక్యూరిటీ గార్డ్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: మహారాష్ట్ర

ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఆమె బాడీగార్డ్ సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను సెక్యూరిటీ సిబ్బంది ఇలా దురుసుగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.