ఢిల్లీలో భూకంప కలకలం: ఉత్తర భారతదేశంలో ఉలిక్కిపడ్డ పలు ప్రాంతాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఉత్తరాఖండ్‌లో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని ఖదున్ లగా గవాలికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకంపనలు ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేశారు.