ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన: బిగ్‌బాస్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
తప్పుడు ఆరోగ్య ప్రకటనలు జేస్తున్నారంటూ జెమిని ఎడిబుల్స్, బిగ్‌బాస్ మరియు ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫ్రీడం రైస్ బ్రాన్ ఆయిల్ విక్రయాల సమయంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటూ తప్పుదోవ పట్టించే ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ-కామర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెమిని సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.