ఎన్నికల సంఘం నిర్ణయాలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఈసీ
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై వస్తున్న విమర్శలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగానే తీసుకున్నామని, కేవలం పత్రికా వార్తల ఆధారంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఈసీ కోరింది. కొత్త ఓటర్ల నమోదు ఫారం-6 లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.