షాకింగ్ ఘటన: పిల్లలిద్దరికి ఉరివేసి తల్లి ఆత్మహత్య

రిపోర్టర్: శివ స్థలం: వికారాబాద్

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి వాసవి ఆత్మహత్య చేసుకున్నట్లు ధారూర్ సీఐ రఘురామ్ తెలిపారు. చిన్నారులు సహర్షరెడ్డి, వేదార్షరెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.