పాతబస్తీ మెట్రో విస్తరణ వేగవంతం: ముప్పై తొమ్మిది భారీ వృక్షాల తొలగింపునకు ఏర్పాట్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో భాగంగా రహదారి విస్తరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దారుల్షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మార్గంలో అడ్డంకులుగా మారిన ముప్పై తొమ్మిది భారీ చెట్లను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అటవీ శాఖ అనుమతులు రాగానే ఈ పనులను ప్రారంభిస్తామని, తొలగించే ప్రతి చెట్టుకు బదులుగా మూడు కొత్త మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు మెట్రో అధికారులు స్పష్టం చేశారు.