భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై రాఫెల్ జెట్ విజయవంతమైన ల్యాండింగ్
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
భారత నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై రాఫెల్ ఎం యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండింగ్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశీయంగా తయారైన ఈ విమాన వాహక నౌకలో రాఫెల్ విమానాల మోసుకెళ్లేందుకు అవసరమైన మార్పులు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మొదటి ప్రయత్నంలోనే ఈ ల్యాండింగ్ విజయవంతం కావడం విశేషం. రాబోయే రోజుల్ లో నావికాదళ శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.