చెన్నైలో మోదీ పర్యటన: పదమూడు వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దేశం తయారీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించామని మోదీ పేర్కొన్నారు.