ఓటర్ల విచారణ కోసం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన అధికారులు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయం వెల్లడించింది. ఇకపై ప్రతి ఓటరూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, బూత్ లెవల్ అధికారులే ఇళ్లకు వచ్చి పత్రాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు ముప్పై మూడు లక్షలకు పైగా ఓటర్లు ఈ ప్రక్రియ పరిధిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.