జలదంకిలో దారుణం: తెదేపా ప్రచార పత్రం చూస్తోందని నాయనమ్మపై మనవడు దాడి
రిపోర్టర్: సతీష్
స్థలం: జలదంకి
తెదేపా అభ్యర్థికి మద్దతుగా కరపత్రం చదువుతోందన్న కోపంతో నాయనమ్మపైనే మనవడు ఇనుప రాడ్డుతో కిరాతకంగా దాడి చేసినట్లు ఎస్సై వీరేంద్రబాబు వెల్లడించారు. జలదంకి మండలంలోని చోడవరం గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వైకాపా నేత ప్రోద్బలంతోనే మనవడు రవికుమార్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు క్షతగాత్రురాలు గడ్డం శివరావమ్మ ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని వెంటనే కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నామని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.