ట్రిచీ జాతీయ రహదారిపై కారు భీకర ప్రమాదం నలుగురు దుర్మరణం
రిపోర్టర్: గోపి
స్థలం: పెరంబలూరు
తమిళనాడు పెరంబలూరు జిల్లాలోని తూరమంగళం సమీపంలో ట్రిచీ-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కారు వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.