రామాయణం సినిమా నుంచి లక్ష్మణుడి పాత్ర పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణం నుంచి నటుడు రవి దూబే పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ పోస్టర్ లో రవి దూబే యోధుడి వేషధారణలో విల్లు ధరించి కనిపించారు. రామాయణం సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.