పెన్సిల్ కొనపై ఆరు మింటామీటర్ల గణేశ విగ్రహాన్ని చెక్కిన యువకుడు
రిపోర్టర్: గోపి
స్థలం: సూరత్
గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన యువకుడు పటేల్ మయాంక్ దినేష్ భాయ్ పెన్సిల్ కొనపై కేవలం ఆరు మింటామీటర్ల పరిమాణంలో అత్యంత సూక్ష్మమైన శ్రీ గణేశ విగ్రహాన్ని మలచి అందరినీ ఆశ్చర్యపరిచారు. గణేశోత్సవ వేడుకల వేళ ఆయన సృష్టించిన ఈ అద్భుత శిల్పం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు సంవత్సరాల క్రితం పెన్సిల్ పై తన పేరు చెక్కే క్రమంలో వచ్చిన ఆలోచనతో ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించినట్లు మయాంక్ తెలిపారు. ఐదు రోజుల పాటు తీవ్ర ఏకాగ్రతతో శ్రమించి ఈ విగ్రహాన్ని పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.