విశాఖలో కోటి రుద్రాక్షలతో విశేష గణనాథుని ప్రతిష్ఠాపన!
రిపోర్టర్: హరి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని గోకుల్ పార్క్ వద్ద వినాయకచవితి వేడుకల్లో కోటి రుద్రాక్షలతో రూపొందించిన మహా గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నేపాల్, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి తెప్పించిన రుద్రాక్షలతో దీన్ని తీర్చిదిద్దారు. భక్తులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఈ విగ్రహాన్ని 21 రోజుల పాటు దర్శించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.