గాన కోకిల పి సుశీల బయోపిక్: తెరపైకి వస్తోందంటూ సోషల్ మీడియాలో భారీ చర్చ

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గళంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సింగర్ పి.సుశీల జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో ఒక బయోపిక్ తెరకెక్కనుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ప్రధాన పాత్రలో నటి రుక్మిణి వసంత్ నటించనున్నారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.