హాంకాంగ్ సిక్సెస్: భారత్పై పాక్ విజయంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ పోస్ట్ కలకలం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హాంకాంగ్

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్పై పాకిస్థాన్ విజయం సాధించిన వేళ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఈ మ్యాచ్లో భారత్ను ఓడించిన పాక్ ఆటగాళ్లను ఆయన అభినందించగా, ఈ పోస్ట్లోని కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టోర్నీలో ఇది తొలి మ్యాచ్ కానప్పటికీ ఆయన ఓపెనింగ్ క్లాష్ అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.